Chaitanya Jonnalagadda: సెలబ్రిటీల పెళ్లిళ్లు.. విడాకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు, ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరిని పెళ్లాడతారో.. ఎప్పుడు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది విడాకులు తీసుకొని హాట్ టాపిక్ గా మారింది మెగా డాటర్ నిహారిక. చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం 2020 లో ఘనంగా జరిపించారు మెగా ఫ్యామిలీ. ఇక ఈ జంట రెండేళ్లు ఎంతో హ్యాపీగా కనిపించారు. ఆ తరువాత వీరి మధ్య విబేధాలు తలెత్తినట్లు సమాచారం. దీంతోనే గతేడాది చివర్లో వీరు డివోర్స్ కు అప్లై చేయగా .. ఈ ఏడాది వారికి విడాకులు మంజూరు అవ్వడం, నిహారిక, చైతన్య తాము విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగాయి. ఇక విడాకుల తరువాత నిహారిక.. కొంత గ్యాప్ తీసుకొని తన కెరీర్ వైపు అడుగులు వేస్తోంది. ఇంకోపక్క చైతన్య.. డిప్రెషన్ లోకి వెళ్లడం వలన.. కొన్ని ఆశ్రమాలు తిరిగి కొంతవరకు కోలుకొని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు.
Siddharth: కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎవడ్రా తమిళోడివి గెట్ అవుట్ అన్నారు
ఇక అందుతున్న సమాచారం ప్రకారం చైతన్య జొన్నలగడ్డ రెండో పెళ్ళికి సిద్ధమయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైతన్య తల్లిదండ్రులు.. వారి కుటుంబంలోనే అతనికి వరుస అయ్యే అమ్మాయిని వెతికారట. తన ఫ్యామిలీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో పెళ్లి జరుగబోతుందట. ఇందుకు చైతన్య కూడా అంగీకరించాడట. అన్ని చక్కగా కుదిరితే.. అతి తక్కువ బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.