Site icon NTV Telugu

Chahatt-Khanna : నాతో పనిచేయం అని చెప్పారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Chahath

Chahath

Chahatt-Khanna : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు ఎంత త్వరగా ప్రేమ వివాహాలు చేసుకుంటారో తెలిసిందే. అక్కడ ఎక్కువగా డేటింగ్ లు ఆ తర్వాత పెళ్లిల్లు కామన్ గానే జరుగుతాయి. ఇక పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతాయో.. అంతే త్వరగా విడాకులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు చాహత్ కన్నా కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కుంటోంది. ఆమె గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకుని ఇద్దరితో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన లైఫ్‌ ఏమీ బాగా లేదని చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో వెల్లడిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

Read Also : Annamalai: అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక పోస్ట్.!

‘నేను 2006లో భరత్‌ నర్సింగనిని పెళ్లి చేసుకున్నా. కానీ అతనిలో లైఫ్‌ బాగా లేదు. అందుకు నాలుగు నెలలకే విడాకులు తీసుకున్నా. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని సినిమాల్లోనే గడిపేశాను. 2013లో ఫర్హాన్‌ మీర్జాను పెళ్లి చేసుకున్నా. మాకు ఇద్దరు పాపలు పుట్టారు. కానీ లైఫ్ లో అనుకోని ఘటనలతో 2018లో ఇద్దరం విడాకులు తీసుకున్నాం. అప్పటి నుంచి నాతో ఎవరూ పనిచేయట్లేదు. మీడియాలో నాపై రకరకాల కథలనాలు వచ్చాయి. రెండు సార్లు విడాకులు తీసుకున్నా కాబట్టి నాతో పనిచేయం అని ముఖం మీదే చెప్పేశారు. పెద్ద స్టార్లు, నిర్మాణ సంస్థలు నన్ను పట్టించుకోవట్లేదు. నాతో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Exit mobile version