NTV Telugu Site icon

Celina Jaitley: తండ్రికొడుకులతో పడుకుంది అన్నందుకు ఇచ్చి పడేసిన మంచు విష్ణు హీరోయిన్

Celina

Celina

Celina Jaitley: సెలీనా జైట్లీ.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగులో కూడా అమ్మడు సుపరిచితమే. మన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాలో సెలీనానే హీరోయిన్. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయేసరికి అమ్మడు మళ్లీ తెలుగువైపు కన్నెత్తి చూడలేదు.. అదే వేరే విషయం. ఇక ఈ ముద్దుగుమ్మ గట్స్ గురించి చెప్పాలంటే.. తాను ఏ తప్పు చేయకుండా తనను ఏదైనా అంటే.. గట్టిగా ఇచ్చిపడేస్తుంది. అది ఎంతటి పెద్దవారు అయినా.. ఇక ఇప్పుడు అమ్మడు గురించి ఎందుకు అంటే.. బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకొని తిరిగే ఉమైర్ సంధు ఉన్నాడు కదా.. ఆటగాడు.. సెలీనాపై ఘాటు ఆరోపణలు చేశాడు. అర్ధం పర్థం లేని ట్వీట్స్ వేసి నెటిజనుల బుర్రను తినడంలో ఉమైర్ ముందు ఉంటాడు.

Ustaad Bhagat Singh: అనుకున్నట్టే.. లక్కీ బ్యూటీని దింపారయ్య

ఇక సెలీనా గురించి అతడు ట్వీట్ చేస్తూ.. “తండ్రీ కొడుకులు అయిన ఫిరోజ్ ఖాన్ – ఫర్దీన్ ఖాన్ తో చాలాసార్లు పడుకున్న ఏకైక హీరోయిన్ సెలీనా జైట్లీ” అని రాసుకొచ్చాడు. అంతే ఈ ఒక్క మాటతో అమ్మడి కోపం నషాళానికి ఎక్కింది. ఇంకేముంది అమైరా కు ఇచ్చి పడేసింది. “డియర్ సంధు .. మీరు మనిషిగా మారడానికి అవసరమైన పెద్ద నాడాను కలిగిఉన్నారా..? మీ అంగస్తంభన సమస్య నుండి మిమ్మల్ని కాపాడగలనని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సమయాకు మీరు వేరే మార్గాలు కనుక వెతుకుతుంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి. అది కూడా నచ్చకపోతే దీన్ని ఎప్పుడైనా ప్రయత్నించు” అంటూ ట్విట్టర్ సేఫ్టీని ట్యాగ్ చేసింది. ఒకే ఒక్క ట్వీట్ తో అతగాడి నోరు మూయించేసింది. ఎంత ఘాటు పదజాలాన్ని వాడిన నెటిజన్లు సెలీనాకే సపోర్ట్ చేస్తున్నారు. బాగా చెప్పావ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.