Celina Jaitly Gives Counter To Netigen: కొందరు వ్యక్తులు ట్రాన్స్‌జెండర్లను చిన్నచూపు చూస్తుంటారు. వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తుంటారు. అసలు వారి ప్రస్తావన వస్తే చాలు.. హేళన చేసి మాట్లాడుతుంటారు. ఒక నెటిజన్ కూడా అలాగే వ్యవహరించడంతో.. బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్లీ అతనికి కౌంటర్ ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఎలా నడుచుకోవాలో తగిన గుణపాఠం నేర్పింది. అసలు ఈ వ్యవహారం మొత్తం ఎక్కడి నుంచి మొదలైందంటే..
NTR30: వేట మొదలుపెట్టిన తారక్.. వీడియో వైరల్
మార్చి 31న అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా.. సెలీనా జైట్లీ వారికి మద్దతును తెలియజేస‍్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ప్రపంచంలో ఉన్న ధైర్యవంతుల్లో ట్రాన్స్‌జెండర్స్ ఒకరని.. వారిపై జరిగే వివక్ష, హింసకు వ్యతిరేకంగా తాను పోరాడుతానని తెలిపింది. ఇది చూసిన ఒక నెటిజన్.. ‘‘ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి వారే అడుక్కుంటారు’’ అంటూ రిప్లై ఇచ్చాడు. అది చూసిన సెలీనా ఒక్కసారిగా మండిపడింది. ‘‘అసలు అందులో తమాషా ఏముంది? ట్రాన్స్‌జెండర్ అయినంత మాత్రాన.. మరీ అడుక్కునే స్థాయికి దిగజారడం చూస్తే గుండె పగిలేలా లేదా? మీలాంటి వారు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని ఎగతాళి చేస్తున్నారు కాబట్టే నేడు ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్‌కి అయ్యింది’’ అంటూ ట్వీట్ చేసింది.
Gunasekhar: ఆ ఒక్క మాట చెప్పగానే.. మోహన్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
అప్పుడు ఆ నెటిజన్ వెంటనే మరో రిప్లై ఇచ్చాడు. ‘‘ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వారు ఎలా అడుక్కుంటారో మీరు చూశారా? అసలు వాళ్లు అడుక్కోరు.. పబ్లిక్‌లో చాలా తప్పుగా ప్రవర్తిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బెగ్గింగ్ పేరిట ఈ ‘స్పెషల్’ జెండర్స్ ప్రవర్తించినట్టుగానే.. ఒక వ్యక్తి ప్రవర్తిస్తే మీరు సమర్థిస్తారా? బహుశా మీ పెంపకం వల్ల, అది చేసినా చేయొచ్చు?’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సెలీనా స్పందిస్తూ.. ‘‘నా పెంపకం గురించి నువ్వు చింతించకు. నేను 4 తరాల భారత సాయుధ బలగాల కుటుంబంలో పెరిగాను. ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పటికీ మన దేశంలో చాలా వెనుకబడి ఉంది. వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వ్యక్తులే వారి బహిష్కరణకు, దుస్థితికి బాధ్యులు’’ అంటూ కౌంటరిచ్చింది.