Site icon NTV Telugu

Happy Birthday Nani : నేచురల్ స్టార్ కు సెలెబ్రిటీల విషెస్

Nani

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. నాని 2005లో క్లాప్ డైరెక్టర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదే సమయంలో రేడియో జాకీగా పని చేశాడు. 2008లో నాని రొమాంటిక్ కామెడీ ‘అష్టా చమ్మా’తో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత వైవిధ్యమైన పలు కమర్షియల్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ నాని ‘అంటే సుందరానికి’, ‘దసరా’ వంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Read Also : Bheemla Nayak: అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు!

ఇక ఈరోజు నాని తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, స్నేహితుల నుంచి సోషల్ మీడియాలో నపుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు ట్విట్టర్‌లో #HappyBirthdayNani, #AnteSundariniki, #Dasara కూడా ట్రెండింగ్ చేస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1496801976398811138
Exit mobile version