సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ సెలబ్రేషన్స్ మార్మోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, సొషల్ మీడియాని ‘రాజకుమారుడి’ జన్మదినం ఫీవర్ పూర్తిగా పట్టేసింది. ఒకవైపు అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాష్ ట్యాగ్ లు రన్ చేస్తోంటే మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలోనే ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసేసింది… ‘బ్లాస్టర్’! పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బర్త్ డే బ్లాస్టర్ ని విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ విజువల్ ట్రీట్ అందించారు. సూపర్ స్టైలిష్ గా ఉన్న మహీ అంతకంటే స్టైలిష్ గా ఫైట్ చేశాడు. అదిరిపోయే డైలాగ్ చెబుతూ కిక్స్ అండ్ పంచెస్ తో యాక్షన్ చూపించాడు.
Read Also : మొదటి అంతర్జాతీయ అవార్డు అందుకున్న నయన్, విగ్నేష్
ఇక హీరోయిన్ కీర్తి సురేశ్ మరోసారి ట్రెడిషనల్ గా టెంప్ట్ చేసేసింది. నమిలి తినేయాలనిపించేంత క్యూట్ గా మురిపించింది! రైట్ నౌ, ‘సర్కారు వారి పాట’ మహేశ్ బర్త్ డే బ్లాస్టర్ వీడియో ట్రెండింగ్ లో ఉంది. ఇక నాకు తెలిసిన నైసెస్ట్ సూపర్ స్టార్ అండ్ ఫరెవర్ ఎంగ్ గా ఉండే మహేశ్ కి హ్యాపీ బర్త్ డే అంటూ తెలంగాణ మంత్రి కెటిఆర్ విషెస్ చెప్పగా… స్టైల్ అండ్ సబ్ స్టెన్స్ కలబోసిన ఎవర్ గ్రీన్ ఛార్మర్ మహేశ్ కి పుట్టిరోజు శుభాకాంక్షలు అన్నారు మెగాస్టార్. ఇక తన షరా మాములుగా తన చిన్నోడికి ఆశీస్సులు అందించారు వెంకీ. మహేశ్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇలా అందరి అభినందనల వెల్లువతో తడిసి ముద్దయిపోతున్నాడు మహేశ్ బాబు.
