ఆగష్టు 15న అంటే నేడు భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ జెండా వందనం జరిగింది. తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జెండాను ఎగరవేశారు. 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి అణచివేత పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఈ రోజున భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భారతదేశంలోని ప్రతి పౌరుడు స్మరించుకుంటాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేడుకలు ఇంతకుముందులా వైభవంగా నిర్వహించలేకపోయారు. దేశవ్యాప్తంగా జెండా వందనం సెలెబ్రేషన్స్ జరుగుతున్న సందర్భంగా సినిమా ప్రముఖులు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి, మోహన్ లాల్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, తాప్సీ పన్ను, శివకార్తికేయన్, మాధవన్ వంటి సౌత్ సూపర్ స్టార్స్ అంతా ట్విట్టర్ ద్వారా “ఇండిపెండెన్స్ డే” శుభాకాంక్షలు తెలియజేశారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం… సెలెబ్రిటీల విషెస్
