Site icon NTV Telugu

NTR: తారక్ నామజపంతో హోరెత్తిన సోషల్ మీడియా.

Ntr

Ntr

ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పేరు మాత్రమే వినిపిస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కావడమే అందుకు కారణం..  నిన్నటి నుంచి  ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక హంగామా మొదలైపోయింది. అభిమానులు ఎన్టీఆర్ ఇంటిముందు  పడిగాపులు కాచి మరీ ఉదయమే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ షురూ చేశారు. ఇక అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇక మరోపక్క  ఎన్టీఆర్‌ సైతం తన 30, 31వ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్‌లను షేర్‌ చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. పలువురు సెలబ్రిటీలు తారక్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఇక ఎవరెవరు ఎన్టీఆర్ కు విషెస్ తెలిపారో చూద్దాం.

Exit mobile version