NTV Telugu Site icon

Dasara: వెన్నెల డాన్స్ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది మాష్టారు…

Dasara

Dasara

దసరా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఇది వెన్నెల కథ, ఆమె కథలోకే ధరణి సూరీలు వచ్చారు అనే విషయం అర్ధమవుతుంది. వెన్నెల లేని దసరా సినిమాని ధరణి-సూరీల జీవితాలని ఊహించడం కూడా కష్టమే. ఈమధ్య కాలంలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కి, ఒక పాన్ ఇండియా సినిమాలో ఇంత ఇంపార్టెన్స్ ఉండడం ఇదే మొదటిసారి. అంత ముఖ్యమైన పాత్రలో అంతే అద్భుతంగా నటించి మెప్పించింది కీర్తి సురేష్. నేషనల్ అవార్డ్ విన్నర్ అనే మాటని జస్టిఫై చేస్తూ కీర్తి సురేష్ దసరా సినిమాలోని వెన్నెల పాత్రకి ప్రాణం పోసింది. కీర్తి సురేష్ కాకుండా ఇంకొకరిని వెన్నెల పాత్రలో ఊహించడం కూడా కష్టమే. రా ఎమోషన్స్ ని, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేసింది. మెయిన్ గా దసరా సినిమా చూసిన వాళ్లకి రోమాలు నిక్కబోడుచుకునే చేసిన ఇంటర్వెల్ బ్లాక్ కి కీర్తి సురేష్ యాక్టింగ్ లో పీక్స్ చూపించేసింది.

వెన్నెల పాత్రని తనని ఆవహించినట్లు, తన పెళ్లి బరాత్ లో కీర్తి సురేష్ డాన్స్ చేస్తూ ఉంటే థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ స్టన్ అయ్యారు. దాదాపు నిమిషం పాటు ఉండే సింగల్ టేక్ స్టెప్ ని నిజంగా ఒక సింగరేణి ప్రాంతంలో ఉన్న అమ్మాయి, తన పెళ్లిలో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో కీర్తి సురేష్ అచ్చం అలానే చేసింది. ఈరోజు దసరా హైలైట్స్ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కీర్తి సురేష్ డాన్స్ గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు. సినిమా చూడని వాళ్ల కోసం కీర్తి సురేష్ ని మరోసారి మహానటిగా నిలబెట్టిన డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియోని మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ డాన్స్ బిట్ చూసిన తర్వాత మరికొంత మంది దసరా సినిమాని చూడడానికి థియేటర్స్ కి రిపీట్ వేస్తే బాగుంటుంది.

Show comments