Case Filed on Pallavi Prashanth for Destroying Cars by his Fans: ఎంతో అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ తెలుగు 7 105 రోజుల అనంతరం ఆదివారం నాడు అంటే నిన్న అంగరంగ వైభవంగా ముగిసింది. ఇక ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా వారిలో చివరికి పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. దీంతో తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్, ఒక విటారా బ్రీజా కారుతో పాటు మరో 15 లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ఇవ్వనున్నారు. ఆ సంగతి అలా ఉంచితే నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతున్న కొంత మంది కార్ల మీద దాడి చేసిన అంశం హాట్ టాపిక్ అయింది. ఇక ఈ క్రమంలో గ్‌బాస్ షో గొడవపై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.
Anupama Parameswaran: సినిమా ఆఫర్స్ కోసం అనుపమ రూటుమార్చిందా..?
ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై ఈ కేసులు నమోదు చేశారు. ఆరు బస్సులు, ఓ పోలీస్ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ఫ్యాన్స్ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. సీసీఫుటేజీ, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించామని ఈ దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇది ఈ ఘటనపై పోలీసుల విచారణ మొదలు పెట్టి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద ఫైల్ చేశారు. ఇక గుర్తించిన పలువురు అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.