NTV Telugu Site icon

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్‌ మానసిక స్థితి బాలేదు.. లియో బ్యాన్ చేయండి!

Leo Producer

Leo Producer

Case filed on Lokesh Kanagaraj to ban Leo Movie: లియో సినిమా రిలీజ్ అయి ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అవుతున్న సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై లీగల్ కేసు నమోదైంది. షాక్ కలిగించే ఈ అంశం తమిళనాడులో చోటు చేసుకుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మానసిక స్థితిని అంచనా వేయాలని కోరుతూ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మదురైకి చెందిన రాజు మురుగన్ ఈ లియో సినిమాలో హింసాత్మకమైన కంటెంట్ ఉన్నది కాబట్టి దాన్ని బ్యాన్ చేయాలని, అలాగే కనగరాజ్ మానసిక పరిస్థితి ఎలా ఉందో స్టడీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఒక యువకుడు అనూహ్యంగా లోకేశ్ కనగరాజ్‌పై న్యాయపోరాటం చేయడంతో తమిళ సినీ అభిమానులు షాక్‌కు గురయ్యారు. నిజానికి ఈ లియో సినిమా విడుదలకు ముందే, నా రెడీ సాంగ్ లిరిక్స్ విషయంలో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా సినిమా కంటెంట్ బాలేదు అని లియోకు సంబంధించి లోకేష్ కనగరాజ్‌పై లీగల్ కేసు నమోదైంది.

Hi Nanna: స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపొయింది… మంచి ప్రేమ కథ చూసేయండి

లియో సినిమా నిజానికిఎక్కువగా హింసను ప్రోత్సహించే దృశ్యాలను కలిగి ఉందని, ఆయుధాల వినియోగం, మతపరమైన చిహ్నాల వాడకం, మాదకద్రవ్యాల దుర్వినియోగం అదే సమయంలో మహిళలు – పిల్లలపై హింసకి చెందిన అంశాలు కూడా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల వినియోగం, ఎలాంటి నేరమైనా పోలీసులకు చిక్కకుండా చెయ్యచ్చనే సంఘ వ్యతిరేక కాన్సెప్ట్‌లను ఈ సినిమాలో చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. సెన్సార్ బోర్డ్ ఇలాంటి సినిమాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, లోకేష్ కనగరాజ్ మానసిక ఆరోగ్యాన్ని సరిగ్గా అంచనా వేయాలని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని పలు చట్టాలు, సెక్షన్లను అనుసరించి లియోపై పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కనగరాజ్ తరపు న్యాయవాద ప్రతినిధులు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తులు కృష్ణకుమార్, విజయకుమార్ కేసు విచారణను వాయిదా వేశారు. మరి లోకేష్ తనను తాను ఎలా డిఫెండ్ చేసుకుంటాడో చూడాలి మరి.