నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఈ శుక్రవారం డిసెంబరు 17న పలు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా అంతకన్నా ముందే విడుదల చేసిన సమంత స్పెషల్ ఐటెం సాంగ్ “ఊ అంటావా మావా ఉఊ అంటావా” సౌత్ లో టాప్ లేపేస్తోంది. కానీ మరో వర్గం మాత్రం ఈ సాంగ్ లోని లిరిక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత చేసిన ఈ సాంగ్ పై, అందులో లిరిక్స్ పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : బన్నీ, కొరటాల కాంబోలో భారీ ప్రాజెక్ట్… ‘పుష్ప’ కంటే ఎక్కువ !
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇంతకుముందు మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే” సినిమాలో ఓ సన్నివేశం అభ్యంతరకరంగా ఉందంటూ కామెంట్స్ చేసిన సమంత… ఇప్పుడు పురుషులను కించపరిచేలా ఉన్న ఈ సాంగ్ లో ఎలా చేసింది ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు మెన్స్ అసోసియేషన్ అంటూ కొంతమంది కేసు కూడా నమోదు చేశారని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకోవడంతో సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఐటెం సాంగ్ కోసం సమంత ప్రత్యేకంగా కనిపించింది. తమిళంలో వివేక, తెలుగులో చంద్రబోస్ ఈ సాంగ్ కు లిరిక్స్ రాశారు.
కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?