Kamal Haasan : కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కన్నడ భాషపై చేసిన కామెంట్లు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్న కర్ణాటకకు వెళ్లినప్పుడు భాషపై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లే కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే అప్పటి నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కమల్ హాసన్ మీద ఫిర్యాదు చేసింది. కన్నడ భాషను అవమానించేలా మాట్లాడిన కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు.
Read Also : IPL 2025: ఎలిమినేటర్ ఆడితే.. టైటిల్ కష్టమా?
థగ్ లైఫ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ మాట్లాడారు. అప్పటి నుంచే కర్ణాటకలో కమల్ మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల కమల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. కానీ వీటిపై తాను తగ్గేదే లే అన్నట్టు కమల్ మాట్లాడుతున్నారు. తాను ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయలేదని.. తాను క్షమాపణ చెప్పేది లేదంటున్నారు.
చాలా రోజులుగా కర్ణాటకలో భాషా వివాదాలు నడుస్తున్నాయి. కర్ణాటక ఉండేవాళ్లు కన్నడ భాషలోనే మాట్లాడాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ కమల్ చేసిన కామెంట్లు నిప్పులో పెట్రోల్ పోసినట్టు మంటలు రేపుతున్నాయి. దీంతో థగ్ లైఫ్ సినిమాను బ్యాన్ చేయాలంటూ కర్ణాటకలో నినాదాలు ఊపందుకుంటున్నాయి. కమల్ క్షమాపణలు చెబితే గానీ ఇవి చల్లారేలా కనిపించట్లేదు.
Read Also : Gadikota Srikanth Reddy: మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడటం లేదు..
