Captain Vijayakanth: కెప్టెన్ విజయ్ కాంత్ హత్య.. దర్శకుడి సంచలన ఆరోపణలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Vijayakanth is Murderd alleges Director Alphonse Puthren: డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ అనారోగ్యం పాలై చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో డీఎండీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ నివాసం, కార్యాలయం వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంబంధించి చికిత్స పొందుతున్న మియట్ హాస్పిటల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “న్యుమోనియా (న్యుమోనియా) వల్ల ఇబ్బందులు పడి ఇప్పుడు కరోనా పాజిటివ్ కారణంగా హాస్పిటల్ లో చేరి, వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతూ విజయకాంత్ మరణించాడు” అని పేర్కొంది. నిజానికి కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న విజయకాంత్ రాజకీయ, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కొంత కాలం క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్నందున, ఆయన క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరి చికిత్స పొందుతూ ఉదయం అకస్మాత్తుగా ఆయన మృతి చెందాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Venky 75: వెంకీ 75 వేడుకల్లో మెరిసిన తారాలోకం.. ఎవరెవరు వచ్చారో, ఫోటోలు చూశారా?
Also Read
ఈ సందర్భంలో ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ సోషల్ మీడియాలో రాసిన ఒక పోస్టు కలకలం రేపుతోంది. తమిళనాడు మంత్రి ఉదయానిధికి బహిరంగ లేఖలా కనిపిస్తున్న సదరు పోస్టులో నేను కేరళ నుంచి వచ్చి నీ ఆఫీసులో కూర్చుని పాలిటిక్స్ లోకి వెళ్ళమని నీకు చెప్పాను, అలాగే నిన్ను కరుణానిధిని ఎవరు చంపారు? జయలలితను ఎవరు చంపారు? అని కూడా తెలుసుకోమని చెప్పా, ఇప్పుడు విజయ్ కాంత్ ను ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అని విజయ్ కాంత్ డి హత్య అని అర్ధం వచ్చేలా రాసుకొచ్చారు. నువ్వు దీన్ని పట్టించుకోక పోతే వాళ్ళు ఇండియన్ 2 సెట్ లో స్టాలిన్, కమల్ హాసన్ లను చంపాలని చూశారు. ఇప్పుడు హంతకులు నిన్ను, లేదా స్టాలిన్ సార్ ను టార్గెట్ గా చేసుకుంటారు. నువ్వు నా నీరం సినిమా హిట్ అయిందని 15 నిముషాల్లో యాపిల్ సెంటర్ కి ఫోన్ చేసి ఫోన్ తెప్పించి గిఫ్ట్ ఇచ్చావు, ఈ మర్దార్లు చేసినవారు ఎవరు అనేది తెలుసుకోవడం అంతకన్నా సింపుల్ అని ఆయన రాసుకొచ్చాడు. మరి ఉదయనిధి అల్ఫోన్స్ మాటలకు ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!