NTV Telugu Site icon

Captain Vijayakanth: కెప్టెన్ విజయ్ కాంత్ హత్య.. దర్శకుడి సంచలన ఆరోపణలు?

Captain Vijayakanth is Murderd alleges Director Alphonse Puthren: డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ అనారోగ్యం పాలై చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో డీఎండీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ నివాసం, కార్యాలయం వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంబంధించి చికిత్స పొందుతున్న మియట్ హాస్పిటల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “న్యుమోనియా (న్యుమోనియా) వల్ల ఇబ్బందులు పడి ఇప్పుడు కరోనా పాజిటివ్ కారణంగా హాస్పిటల్ లో చేరి, వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతూ విజయకాంత్ మరణించాడు” అని పేర్కొంది. నిజానికి కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న విజయకాంత్ రాజకీయ, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కొంత కాలం క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్నందున, ఆయన క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరి చికిత్స పొందుతూ ఉదయం అకస్మాత్తుగా ఆయన మృతి చెందాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Venky 75: వెంకీ 75 వేడుకల్లో మెరిసిన తారాలోకం.. ఎవరెవరు వచ్చారో, ఫోటోలు చూశారా?

ఈ సందర్భంలో ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ సోషల్ మీడియాలో రాసిన ఒక పోస్టు కలకలం రేపుతోంది. తమిళనాడు మంత్రి ఉదయానిధికి బహిరంగ లేఖలా కనిపిస్తున్న సదరు పోస్టులో నేను కేరళ నుంచి వచ్చి నీ ఆఫీసులో కూర్చుని పాలిటిక్స్ లోకి వెళ్ళమని నీకు చెప్పాను, అలాగే నిన్ను కరుణానిధిని ఎవరు చంపారు? జయలలితను ఎవరు చంపారు? అని కూడా తెలుసుకోమని చెప్పా, ఇప్పుడు విజయ్ కాంత్ ను ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అని విజయ్ కాంత్ డి హత్య అని అర్ధం వచ్చేలా రాసుకొచ్చారు. నువ్వు దీన్ని పట్టించుకోక పోతే వాళ్ళు ఇండియన్ 2 సెట్ లో స్టాలిన్, కమల్ హాసన్ లను చంపాలని చూశారు. ఇప్పుడు హంతకులు నిన్ను, లేదా స్టాలిన్ సార్ ను టార్గెట్ గా చేసుకుంటారు. నువ్వు నా నీరం సినిమా హిట్ అయిందని 15 నిముషాల్లో యాపిల్ సెంటర్ కి ఫోన్ చేసి ఫోన్ తెప్పించి గిఫ్ట్ ఇచ్చావు, ఈ మర్దార్లు చేసినవారు ఎవరు అనేది తెలుసుకోవడం అంతకన్నా సింపుల్ అని ఆయన రాసుకొచ్చాడు. మరి ఉదయనిధి అల్ఫోన్స్ మాటలకు ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

Show comments