Site icon NTV Telugu

Captain Miller Trailer: ధనుష్ నట విశ్వరూపం.. ట్రైలర్ మాత్రం అరాచకం

Captain

Captain

Captain Miller Trailer: నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 2 నిమిషాల 54 సెకన్ల మారణ హోమాన్ని చూసినట్లు అనిపిస్తుంది.

ధనుష్‌ను టైటిల్ రోల్‌ లో కెప్టెన్ మిల్లర్ గా పరిచయం చేస్తూ, బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని స్వాతంత్ర్యానికి ముందు కాలంలోకి మనల్ని తీసుకువెళుతుంది ట్రైలర్. ధనుష్ తన గ్రామాన్ని దోచుకోవడానికి ప్రయత్నించే వలసవాదులను ఎదుర్కొంటూ స్థానిక తిరుగుబాటు నాయకుడిగా కనిపించారు. అతన్ని బ్రిటీష్ వారు డకాయిట్ అని, స్థానికులు దేశద్రోహి అని పిలుస్తారు. ధనుష్ యాక్షన్స్ ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి వుందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. ధనుష్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించారు. అద్భుతమైన నటనను కనపరిచి సినిమాను తన భుజాలపై నడిపారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకున్నారు.

అరుణ్ మాథేశ్వరన్ కథను ఆసక్తికరంగా మలిచినట్లు కనిపిస్తోంది. ధనుష్‌ని మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్, యాక్షన్ అవతార్‌లో చూపించారు. సిద్ధార్థ నుని కెమెరా పనితనం అద్భుతంగా వుంది, జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్ చేశారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్,అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్ లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తనిని ట్రైలర్ అంచనాలు మరింతగా పెంచింది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version