NTV Telugu Site icon

Pooja Hegde: పూజా పాప ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేయడానికి ఇద్దరు రెడీ…

Pooja Hegde

Pooja Hegde

ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో పూజా హెడ్గే కూడా ఉంది. తమిళ్, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోని స్టార్ హీరోల పక్కన పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తోంది పూజా. అయితే పూజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతోంది. పూజా హెగ్డే హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది, ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ వెయ్యడానికి ఇద్దరు దర్శకులు రెడీ అయ్యారు. స్టార్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరిలో ఒకరు హరీష్ శంకర్. పూజా హెగ్డేలోని గ్లామర్ యాంగిల్ ని చూపించి Dj(దువ్వాడా జగన్నాధ్), ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో మంచి బ్రేక్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఇదే టైంలో పూజా హెగ్డే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’లో నటించింది. ఎన్టీఆర్ పక్కన నటించిన ఈ మూవీ తర్వాత పూజా మరింత బిజీ అయిపొయింది. ఈ క్రేజ్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లిన సినిమా ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ బిగ్గెస్ట్ హిట్ మూవీ పూజాని అందరి చేత బుట్టబొమ్మ అని పిలిపించేలా చేసింది.

పూజా ప్రస్తుతం ఉన్న ఫ్లాప్ స్ట్రీక్ ని ఎండ్ కార్డ్ వేయడానికి, ఆమె లక్కీ డైరెక్టర్స్ అయిన హరీష్ శంకర్ త్రివిక్రమ్ లు హ్యాట్రిక్ సినిమాలు చేయడానికి లైన్లోకి వచ్చారు. త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబుతో SSMB 28 సినిమా చేస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమకాగా, మహేష్ పూజాలకి ఇది రెండు సినిమా. గతంలో ఈ ఇద్దరూ కలిసి మహర్షి సినిమాలో నటించారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కలయికలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ మూవీలో పూజా హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ పక్కన పూజా జేగ్దే నటించడం ఇదే మొదటిసారి. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో SSMB 28 సినిమా 2023లోనే రిలీజ్ కి షెడ్యూల్ అయ్యి ఉండగా, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు బయటకి వస్తుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాలతో పూజా మళ్లీ గోల్డెన్ గర్ల్ అవుతుందేమో చూడాలి.

Show comments