మిస్టర్ బచ్చన్‌లో నడుమ అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమె స్క్రీన్ ప్రజెన్స్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. నార్త్ బెల్ట్‌లో చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో టాలీవుడ్‌పై ఫోకస్ చేసిన భాగ్యశ్రీ గ్లామర్ షోతో యూత్ హృదయాలను గాయబ్ చేయడంలో, అవకాశాలను దక్కించుకోవడంలో మార్కులు కొట్టేసింది. ప్రజెంట్ ‘కింగ్ డమ్’ సినిమా చేస్తున్న ఈ భామ శ్రీలీల వదిలేసిన ఆఫర్‌ను చేజిక్కించుకుంది.
Also Read : Cine Roundup : కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. క్రేజీ అప్డేట్స్
అక్కినేని అఖిల్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ లెనిన్. రీసెంట్లీ శ్రీలీల బర్త్ డే సందర్భంగా హీరోయిన్ లేనిల్ లో హీరోయిన్ గా ఫిక్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ సడెన్లీ ఈ ప్రాజెక్ట్ నుండి శ్రీలీల వైదొలిగింది. అయితే ఇదే కాదు కింగ్ డమ్ కోసం రెండేళ్ల క్రితం ఫస్ట్ శ్రీలీలనే అప్రోచ్ అయ్యారని అప్పుడు ఫుల్ ప్యాక్డ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయింది టాక్. లెనిన్ సంగతి అటు ఉంచితే భాగ్యశ్రీ వరుసగా క్రేజీ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. రామ్ పోతినేనితో ఆంధ్రా కింగ్ తాలూకాతో పాటు దుల్కర్ సల్మాన్ సరసన కాంతలో నటిస్తోంది. ప్రజెంట్ ఈ రెండూ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవేకాకుండా ప్రభాస్- ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఈ భామను అప్రోచ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ లైనప్‌తో లక్కీ గర్ల్ అనిపించుకుంటున్న ఈ ముంబయి బ్యూటీ కనుక డార్లింగ్ సినిమాలో ఫిక్సైతే నిజంగా లక్ తోక తొక్కినట్లే. రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
