Site icon NTV Telugu

BVSN Prasad: గోదావరి జిల్లాల జనసేన టికెట్ రేసులో బడా టాలీవుడ్ ప్రొడ్యూసర్

Bvsn Prasad Janasena Ticket

Bvsn Prasad Janasena Ticket

BVSN Prasad Seeks Janasena Ticket in Godavari Districts: పొత్తుల సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 2024 ఎన్నికలకు జనసేన అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. మొన్నటి వరకు సీఎం అవ్వడం కుదురుతుందా? లేదా? అనే మీమాంసలో ఉన్న పవన్ ఇప్పుడు కాబోయే సీఎం తానే అన్నట్టు మాట్లాడుతూ తన పార్టీ శ్రేణులలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలు పక్కన పెట్టేసిన పవన్ వారాహి యాత్రలో ఉన్నారు. గోదావరి జిల్లాల్లో ఆయన చేపట్టిన వారాహి యాత్ర కొనసాగుతోంది. అయితే గత ఎన్నికల సమయంలో పవన్ వెంట నడించేందుకు పెద్దగా టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రయత్నించలేదు కానీ ఈసారి ఎందుకో ఆయనతో కలిసి నడిచే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ మంగళగిరి కార్యాలయానికి వెళ్లిన ఆయన ప్రస్తుత సినిమాల దర్శక నిర్మాతలు వారాహి యాత్రకు సంఘీభావం తెలిపారు. మరోపక్క టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌ అయితే ఏకంగా జనసేన కండువా కప్పేసుకున్నారు కూడా.
Rana Daggubati: పాన్ ఇండియా సినిమాలో రానా.. సైలెంట్ గా కానిచ్చేశారు!
ఇక టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు గోదావరి జిల్లాల నుంచి భోగవల్లి ప్రసాద్ జనసేన టిక్కెట్ ఆశిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరికి చెందిన భోగవల్లి ప్రసాద్ చాలా కాలం నుంచే టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఉన్నాడు. 1986లో డ్రైవర్ బాబు సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఛత్రపతి, మగధీర, అత్తారింటికి దారేది ఇటీవలి విరూపాక్ష లాంటి హిట్ సినిమాలు అందుకున్నాడు. ఇప్పటికే తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణ సంస్థ బాధ్యతలను తన కుమారుడు భోగవల్లి బాపినీడుకు అలవాటు చేసిన ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే అయినా అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక నిజానికి లెక్క ప్రకారం అయితే ఎన్నికలు ఇంకా 10 నెలలలో జరుగుతాయి అంటే ఆలోపు ఈ వార్తలు నిజమా? లేక ఒట్టి ప్రచారమేనా? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version