NTV Telugu Site icon

Business Man 4K: ఇదికదా బాబు బ్రాండ్ అంటే.. రీ రిలీజుల్లో ఆల్ టైం రికార్డు బద్దలు

businessman

businessman

BusinessMan4K Special Shows Collects 5.31 Crore Worldwide Gross : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసిన క్రమంలో ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేష్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచి ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడగా అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’ మంచి వసూళ్లు రాబట్టింది. ఓ యువకుడు ఒంటరిగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వెళ్ళి అక్కడి చీకటిదందాలోనే వేలు పెట్టి, నేర చరిత గల వారిని ఎలా హడలెత్తించాడు అన్న కధతో తెరకెక్కించారు. మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, నాజర్, ప్రకాష్ రాజ్, సయాజీ షిండే, రాజా మురాద్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, ధర్మవరపు, భరత్ రెడ్డి, రాజీవ్ మెహతా, బండ్ల గణేష్, ఆకాశ్, శ్వేతా భరద్వాజ్ నటించిన ఈ సినిమాలో ఓ సీన్ లో క్యాబ్ డ్రైవర్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనిపిస్తారు.

Jailer Disaster: జైలర్ డిజాస్టర్.. విజయ్ ఫ్యాన్స్ అరాచకం

ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, భాస్కరభట్ల పాటలు రాశారు. ఈ మూవీ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ లో బిజినెస్ మేన్ సినిమా పెద్ద ఎత్తున వసూళ్లను రాబడుతోందని తెలుస్తోంది. 4కే స్పెషల్ షోలకు గాను ఐదుకోట్ల 31 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఒక ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. ఇక ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాంలో – 2.5 కోట్లు సీడెడ్ – 35.6 లక్షలు, ఈస్ట్ గోదావరి- – 26.5 లక్షలు, గుంటూరు – 31.4 లక్షలు, నెల్లూరు – 7.13 లక్షలు, వెస్ట్ గోదావరి – 15.28 లక్షలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.42 కోట్లు, ఓవర్ సీస్ 35 లక్షలు, మిగతా భారతదేశంలో 26.76 లక్షలు, కర్ణాటకలో – 27.3 లక్షలు మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ 5.31కోట్లు వసూలు చేసింది.