Mithramandali : నిర్మాత బన్నీ వాసు ఈ మధ్య ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక కాంబోలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ లో బన్నీవాసు మాట్లాడారు. ఇందులో దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా.. చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్ లో పక్క సినిమాలను తొక్కేసి తమ సినిమాలను ఆడించుకోవాలని చాలా మంది చూస్తుంటారు. ఇలాంటి వాటిపై మీరేం స్పందించారు అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి బన్నీవాసు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.
Read Also : Hrithik Roshan : హృతిక్ రోషన్ కు హైకోర్టులో ఊరట..
పక్క సినిమాను తొక్కితేనే మన సినిమా ఆడుతుంది అనుకుంటే అంతకన్నా పిచ్చోళ్లు ఇంకెవరూ ఉండరు. సినిమా బాగుంటే రెండూ ఆడుతాయి. లేదంటే రెండూ ఆడవు. కొన్ని సార్లు తొక్కాలని చూస్తే చివరకు వాళ్ల సినిమా బాగున్నా సరే నెగెటివిటీ పెరిగి దెబ్బ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏ సినిమాను తొక్కాలని చూసినా అది పిచ్చితనమే అవుతుంది. ఇక్కడ జీవితాలు పనంగా పెట్టి సినిమాలు చేస్తున్నాం. కాబట్టి ఒక సినిమాను తొక్కడం అంటే అది మనసున్నోళ్లు చేసేది కాదు. నా వరకు అయితే పక్క సినిమాలకు కూడా నా సినిమాలతో సమాన ప్రాధాన్యత ఇస్తుంటాను. ఇక్కడ అందరి సినిమాలు ఆడాలి. అందరూ బాగుండాలి అని కోరుకుంటానని తెలిపారు బన్నీవాసు.
Read Also : Ahana Krishna : లగ్జరీ కారు కొన్న హీరోయిన్.. ఎన్ని కోట్లంటే..?
