NTV Telugu Site icon

Bunny Vas: చైతుని చూసి షాక్ అయ్యా.. మాటల్లో చెప్పలేను, బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు

Bunny Vasu

Bunny Vasu

Bunny Vas Comments on Thandel Movie Opening: తండేల్ మూవీ ఓపెనింగ్ లో దర్శకుడు చందూ మొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా ఈ కథపై వర్క్ చేశామని, వాసు – అరవింద్ అద్భుతంగా ప్రోత్సహించారన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు, వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తానన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ దర్శకుడు, రచయిత నిర్మాతలందరికీ ఈ సినిమా పట్ల ఒక విజన్ ఉంది, ఆ విజన్ మీ అందరికీ సరిగ్గా చేరుతుందని ఆశిస్తున్నా, మీ అందరి బ్లెస్సింగ్ కావాలని కోరారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇది గీతా ఆర్ట్స్ కి చాలా ప్రత్యేకమైన స్క్రిప్ట్, ఇంత రీసెర్చ్ ఏ సినిమాకి జరిగుండదు, ఈ కథకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా లోతుగా వెళ్లి క్యాప్చర్ చేయడంలో టీం చాలా ఎఫర్ట్ పెట్టిందని అన్నారు. మూడేళ్ళ క్రితం ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ కి వచ్చింది. అప్పటి నుంచి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, ఏడాదిన్నరగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు.

Allu Aravind: ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇచ్చిన కమిట్మెంట్ కోసం నిలబడ్డాడు.. ఆ దర్శకుడికి అల్లు మార్క్ కౌంటర్!

చందు ఈ కథని అద్భుతంగా మలిచారని, ఆయనకు హ్యాట్సప్ చెప్పాలన్నారు. చైతూది ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్, దీనికి చైతు స్కిన్ టోన్ తో పాటు అన్నీ ఎలా కుదురుతాయో అనే ఆలోచన ఉండేది, అయితే తండేల్ ఫస్ట్ లుక్ చూసి ఆడియన్స్ తో పాటు నేను షాక్ అయ్యా, ఒక నటుడు ఒక పాత్ర బలంగా నమ్మి చేస్తే ఎలా ఉంటుందో అర్థమైయింది. పోస్టర్ చూసిన తర్వాత వచ్చిన నమ్మకం, సంతోషం మాటల్లో చెప్పలేను, నాగచైతన్య హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్. సినిమాకి చైతు 200 పర్సెంట్ ఇస్తున్నారు, రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. సాయి పల్లవికి రెండేళ్ళ క్రితం కథ చెప్పాం, వారి ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. చందూ అద్భుతమైన క్యాలిటీతో ప్రోడక్ట్ ని ఇస్తారు, నాగ చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్‌కి మారారు, కండలు తిరిగి దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్డ్ వర్క్ చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలో జరగనుంది.