Site icon NTV Telugu

Bunny Trivikram: మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది… ఈసారి సోషియో ఫాంటసీ

Bunny Trivikram

Bunny Trivikram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి నాలుగో సినిమా చేస్తున్నారు అనగానే… ఆ మూవీ అప్డేట్ కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. గత కొన్ని రోజులుగా అందరినీ ఊరిస్తున్న ఈ అప్డేట్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. త్వరలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాం, ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పినట్లు సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సారి కలిసి వర్క్ చెయ్యబోతున్నారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు బౌండరీలు కూడా దాటబోతున్నాం అని హారికా హాసిని, గీత ఆర్ట్స్ అనౌన్స్ చేసాయి. గుంటూరు కారం సినిమా వర్క్స్ అయిపోగానే స్టార్ట్ అవనున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందనుంది. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ పేర్లు తప్ప ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర విషయాలని మేకర్స్ ఇంకా ఫైనల్ చెయ్యలేదు. పుష్ప 2 షూటింగ్ అయిపోగానే అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ అవ్వనున్నాడు.

మరి ఇప్పటివరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలతో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ హీరో అండ డైరెక్టర్ కాంబినేషన్… నాలుగో సారి సోషియో ఫాంటసీ జానర్ లో ఎలాంటి కథతో సినిమా చెయ్యనున్నారు? ఇందులో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు? మ్యూజిక్ అనిరుద్ ఇస్తాడా లేక త్రివిక్రమ్ థమన్ కే ఓటేస్తాడా? లాంటి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. నిజానికి త్రివిక్రమ్ సినిమా స్థానంలో అల్లు అర్జున్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చెయ్యాల్సి ఉంది. ఆచార్య రిజల్ట్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది, ఎన్టీఆర్ తో దేవర హిట్ కొడితే మళ్లీ అల్లు అర్జున్-కొరటాల శివ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బన్నీ లిస్టులో సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు కాబట్టి ఈ సినిమాల్లో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుంది అనేది చూడాలి.

Exit mobile version