Site icon NTV Telugu

Bunny: మీ సపోర్ట్ తోనే ఇక్కడ ఉన్నాను… అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్

Bunny

Bunny

2003లో గంగోత్రి సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి, మెగాస్టార్ అండతో, అల్లు అరవింద్ ప్లానింగ్ తో, తన సొంత టాలెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఎఫోర్ట్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. స్టార్ హీరో ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వరకూ సోలోగానే సినిమా ప్రయాణం చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా మొత్తానికి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇండస్ట్రీలోకి 20 ఏళ్లు అయిన సంధర్భంగా… “Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. చివరిలో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి ఆడియన్స్, ఫాన్స్ చూపించిన ప్రేమనే కారణం.

ఎప్పటికీ రుణపడి ఉంటాను అని బన్నీ పోస్ట్ చేసిన లైన్ అందరి దృష్టిని లాగేస్తుంది. తనకి స్టార్టింగ్ సపోర్ట్ గా నిలిచిన మెగా ఫ్యామిలీ గురించి కానీ తన సొంత అల్లు కుటుంబం గురించి కానీ అల్లు అర్జున్ తన ట్వీట్ లో మెన్షన్ చెయ్యలేదు, కేవలం అభిమానులని ఉద్దేశించి మాత్రమే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూడగానే  “చరణ్ పుట్టిన రోజు ట్వీట్ చెయ్యడానికి మాత్రం టైం లేదా నీకు” అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజున అల్లు అర్జున్ ని ట్వీట్ రాలేదనే విషయం అందరికీ తెలిసిందే. మరి అల్లు అర్జున్ ట్వీట్ తో మరోసారి మెగా హీరోలకి-బన్నీకి మధ్య గ్యాప్ ఉంది అనే విషయం బయటపడింది. ఈ గ్యాప్ ని సెట్ చెయ్యడానికి మెగాస్టార్ రంగంలోకి దిగుతాడేమో చూడాలి.

Exit mobile version