Site icon NTV Telugu

TFDA: డైరెక్టర్ల కోసం ఎవరూ ఊహించని సాయం చేయడానికి రెడీ అయిన బన్నీ..

Tfda

Tfda

తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రముఖ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మే 4వ తారీఖున డైరెక్టర్స్ డే గా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సందర్బంగా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు భారీ విరాళాలను అందిస్తూనే ఉన్నారు.. తాజాగా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఎవరూ ఊహించని సాయం ప్రకటించినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి..

ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్స్ డే ను గ్రాండ్ గా చేయాలని చాలా ప్లాన్ వేసింది తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్. కానీ కొన్ని కారణాల వల్ల అది కాస్త ఈ నెల 19 కి పోస్ట్ పోన్ అయ్యింది.. అయితే దీనికి ఇందులో భాగంగా ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్స్ ను ఇన్వైట్ చేశారు.. అంతేకాదు స్టార్ హీరోలను కూడా కలిసి ఇన్వైట్ చేశారు. ఈ క్రమంలో డైరెక్టర్ అసోసియేషన్ కి లక్షల్లో విరాళాలు అందుతున్నాయి. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ 35 లక్షలను ఈ అసోసియేషన్ కు విరాళంగా అందించారు..

తాజాగా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఎవ్వరు ఊహించని సాయాన్ని ప్రకటించినట్లు తెలుస్తుంది.. మే 19న జరగనున్న డైరెక్టర్స్ డే ఈవెంట్‌కి ఆహ్వానించడానికి TFDA కమిటీ సభ్యులు, టాలీవుడ్ డైరెక్టర్స్ ఆయనను ఆహ్వానించేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో వారితో మాట్లాడిన అల్లు అర్జున్ వెంటనే 10 లక్షల చెక్కును అందించాడు.. అలాగే కొత్త భవనం నిర్మాణానికి తన పూర్తి సహాయాన్ని అందించాడు.. అలాగే ఆ ఈవెంట్ కు హాజరవుతానని హామీ ఇచ్చాడు.. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కి సిద్ధంగా ఉంది..

Exit mobile version