Site icon NTV Telugu

Allu Arjun : మరో వివాదంలో బన్నీ..!

New Project (1)

New Project (1)

 

బన్నీకి వివాదాలు కొత్తేం కాదు.. అయితే అల్లు అర్జున్ పై వచ్చే వివాదాలన్నీ కూడా.. దాదాపుగా కమర్షియల్‌ యాడ్స్‌కు సంబంధించినవే. అందుకే బన్నీ ఈ సారి మరో కొత్త వివాదంలో అంటూ.. జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తప్పుదోవ పటిస్తున్నాడంటూ.. ఐకాన్ స్టార్ పై కేసు కూడా నమోదైందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ బన్నీపై వస్తున్న ఈ కొత్త ఇష్యూ ఏంటి..!

ఇటీవలె బన్నీ నటించిన పుష్ప చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న సుకుమార్.. అతి త్వరలో రెగ్యూలర్ షూట్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ కూడా ఇప్పటికే కసరత్తులు మొదలెట్టాడు. అందుకే అల్లు అర్జున్ ఎక్కడ కనిపించినా.. పుష్పరాజ్‌ లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఆ మధ్యన బన్నీ చేసిన కొన్ని యాడ్స్.. దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాపిడో, జొమాటో సంస్థల కోసం చేసిన యాడ్స్ వివాదస్పదంగా మారాయి. ఇక తాజాగా బన్నీ చేసిన మరో యాడ్ కూడా వివాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఇటీవలె ఓ విద్యా సంస్థ కోసం ఒక యాడ్ లో నటించాడు అల్లు అర్జున్. అయితే ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని.. ఇందులో నటించిన అల్లు అర్జున్‌పై, సదరు విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని.. ఓ సామాజికి కార్యకర్త పోలీసులకు కంప్లైట్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి వివాదాలు ఎన్ని ఎదురైనా.. ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరోవైపు కమర్షియల్‌గా.. పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు బన్నీ. ఏదేమైనా అల్లు అర్జున్ అంటే.. తగ్గేదేలే..!

Exit mobile version