Site icon NTV Telugu

Bujji Ila Raa: వారం వెనక్కి వెళ్ళిన ‘బుజ్జి ఇలా రా’

Bujji Ila Ra

Bujji Ila Ra

Bujji Ila Raa: సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జి. నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటీవల ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ విజువల్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 19న సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించిన ఇప్పుడు అది ఆగస్ట్ 27కు వాయిదా పడింది. రాజారవీంద్ర, పోసాని కృష్ణముర‌ళి, శ్రీకాంత్ అయ్యంగార్, స‌త్యకృష్ణ, వేణు, భూపాల్‌, ‘టెంప‌ర్’ వంశీ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సాయికార్తిక్ సంగీతం సమకూర్చారు.

Exit mobile version