Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu: డైరెక్టర్ బుచ్చిబాబు – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) క్యారెక్టర్ లెంగ్త్ తక్కువగా ఉందంటూ వస్తున్న కొన్ని కామెంట్స్‌పై దర్శకుడు బుచ్చిబాబు తొలిసారి నోరు విప్పారు. తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో డైరెక్టర్ దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాపై వస్తున్న ట్రోల్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ డిలీటెడ్ సీన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి జాన్వీ కపూర్ రోల్ విషయంలో కొంత బ్యాక్లాష్ రావడంపై బుచ్చిబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. కథ ప్రకారం ఆ అమ్మాయి పాత్ర చాలా రెబలిష్‌గా, రఫ్‌గా ఉంటుంది. అయితే ఎడిటింగ్‌లో కొన్ని కారణాల వల్ల రెండు మూడు కీలకమైన సీన్లు కట్ చేయాల్సి వచ్చింది. దానివల్లే ఆడియన్స్‌కు క్యారెక్టర్ ఎక్కడో మిస్సయినట్లు అనిపించింది” అని వివరించారు. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రకు ఎంతటి పవర్ఫుల్ ఎమోషన్ రాశానో.. ఈ సినిమాలో ‘అచ్చియమ్మ’ పాత్రను కూడా అంతే అద్భుతంగా రాసుకున్నానని ఆయన చెప్పారు. చీకట్లో ముద్దు పెట్టిన వ్యక్తి తన హీరో అని తెలిశాక.. అతడు చచ్చాడో బతికాడో తెలియకపోయినా మెడలో తాడు కట్టేసుకునే అంతటి ప్యూర్ లవ్ ఆమెదని, ఆ ఎమోషన్ కనెక్ట్ చేసే సీన్లు కట్ అవ్వడం వల్లే ఈ చర్చ నడుస్తోందన్నారు.
Also Read
మెగా ఫ్యాన్స్‌కు బుచ్చిబాబు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. “జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఆ డిలీటెడ్ సీన్స్‌ను బుధవారం నుంచి థియేటర్లలో యాడ్ చేస్తున్నాం. ఆ సీన్లు పడ్డాక అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఎలా ఎలివేట్ అవుతుందో మీరే చూస్తారు” అని ఆయన ప్రకటించారు. దీంతో బుధవారం నుంచి ‘పెద్ది’ థియేటర్లలో సరికొత్త జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. చివరగా ఆయన మాట్లాడుతూ.. “ఉప్పెనలో ఒక మంచి సందేశం ఇచ్చాం.. పెద్దిలోనూ కమర్షియల్ యాంగిల్స్‌తో పాటు ఒక మంచి మెసేజ్, ఒక మంచి మాట చెప్పాం. సమాజానికి ఏదో ఒకటి చెప్పాలనే కొద్దిమంది డైరెక్టర్లలో నేను ఒకడిని అని ఫీల్ అవుతాను. కానీ.. నా నెక్స్ట్ సినిమాకు మాత్రం ఎలాంటి మంచి మాటలు చెప్పను! ఫస్ట్ సీన్ నుంచే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా, ఊరమాస్‌గా ఉంటుంది” అని బుచ్చిబాబు తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!