ఇప్పటి వరకూ గ్లామ్ పాత్రలకు పరిమితమైన తమన్నా తొలిసారి ఓ బౌన్సర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్డూడియో నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ఆరంభం అయింది. 'చాందినీ బార్', 'ఫ్యాషన్' వంటి చిత్రాలతో ప్రశంసలతో పాటు పలు అవార్డులు గెలుచుకున్న ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్. ఇందులో తమన్నా డి-గ్లామ్ లుక్ లో కనిపించనుంది.
షూటింగ్ స్పాట్ నుండి దర్శకుడితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది తమన్నా. ఇండియాలో తొలి మహిళా బౌన్సర్ కథతో వస్తున్న సినిమా ఇదని, త్వరలో ఇతర వివరాలు తెలియచేస్తామని అంటున్నారు దర్శకనిర్మాతలు. బండార్కర్ దర్శకత్వంలో నటించటం ఛాలెంజ్ గా ఉందని, తనను బౌన్సర్ గా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నట్లు తమన్నా చెబుతోంది. ఇటు తమన్నాకి అటు మాధర్ బండార్కర్ కి ఈ సినిమా విజయం కీలకం. మరి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నాని మాధుర్ ఎలా చూపిస్తారో చూడాలి.
