NTV Telugu Site icon

Bro Movie: పొలిటికల్ పంచ్ లు అన్నారు.. త్రివిక్రమ్ మార్క్ అన్నారు.. ఎక్కడ బ్రో.. ?

Pawan

Pawan

Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ కాంబో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ చేత త్రివిక్రమ్ చెప్పించే డైలాగ్స్ కోసమే అభిమానులు థియేటర్ లకు క్యూ కడతారు. డైరెక్టర్ కాకముందు త్రివిక్రమ్ మాటల రచయిత అని అందరికి తెల్సిందే. ఇక పవన్ పొలిటికల్ స్పీచ్ లు కొన్నిసార్లు త్రివిక్రమే రాసేవాడు. అందుకే ఈ కాంబో అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ .. బ్రో సినీమాతో రీపీట్ అవుతుంది అనుకున్నారు కానీ, ట్రైలర్ చూసాక అభిమానుల ఆశలు నిరాశలు అయ్యాయి. ఈసారి త్రివిక్రమ్ తుస్సుమనిపించాడు. మొదట ఈ సినిమా అనుకున్నప్పుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు అనగానే అభిమానులు ఎగిరిగంతేశారు. హమ్మయ్య రీమేక్ అయినా కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ వినడానికి అయినా వెళ్లొచ్చు అనుకున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు కూడా ట్రైలర్ పై భారీ హైప్ ను క్రియేట్ చేశారు. ఇందులో పవన్ డైలాగ్స్ అదిరిపోతాయి అని, కొన్ని పొలిటికల్ సెటైర్స్ కూడా ఉంటాయని టాక్ నడించింది. తీరా, ట్రైలర్ చూసాక.. అంతా బావుంది కానీ, ఏదో మిస్ అయిన ఫీల్ వచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అదే త్రివిక్రమ్ మార్క్. అవును. త్రివిక్రమ్ మాటల తూటాలు ట్రైలర్ లో ఒక్కటి కూడా కనిపించలేదు.

Chandramukhi 2: చావు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు.. హైప్ పెంచేసిన కీరవాణి

కనీసం భీమ్లా నాయక్ ట్రైలర్ లో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఒక్కటి కూడా లేదని అంటున్నారు. బ్రో ను త్రివిక్రమ్ లైట్ తీసుకున్నాడా.. ? అనే అనుమానాలు ఎక్కువ అయిపోతున్నాయి. లేక గుంటూరు కారం సినిమా తో బిజీగా ఉన్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇంకోపక్క బ్రో సినిమాకు అస్సలు బజ్ లేదు. ట్రైలర్ రిలీజ్ అయినా కూడా అంత హైప్ ఓఎంచే ప్రమోషన్స్ ఒక్కటి కూడా లేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ ఒక్కడే ఈ సినిమా ప్రమోషన్స్ ను భుజాల మీద వేసుకొని చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలంటే జూలై 28 వరకు ఆగాల్సిందే.