NTV Telugu Site icon

BRO : అడ్వాన్స్ బుకింగ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో మూవీ..

Whatsapp Image 2023 07 26 At 2.29.40 Pm

Whatsapp Image 2023 07 26 At 2.29.40 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్. ఈ సినిమాని విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఒరిజినల్ సినిమా కథలో దర్శకుడు త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేసి బ్రో సినిమాకు అద్భుతమైన స్క్రీన్ ప్లే ను అందించారు.ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామా గా తెరకెక్కింది.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ తో  టీజీ విశ్వప్రసాద్ మరియి వివేక్ కూచిభోట్ల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించారు.అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదల అయిన శ్లోకం థిమ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే అన్ని ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 28న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక మంగళవారం ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్రో సినిమా సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్ల వద్ద తెగ రచ్చ చేస్తున్నారు.ఇక మరోవైపు బ్రో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా కావడంతో ముందుగానే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్.ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్.. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే గంటలో బుక్ మై షో యాప్‏లో పదివేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఓపెన్ చేసిన గంటలోనే ఏకంగా పదివేలకు పైగా టికెట్స్ సేల్ కావడంతో నిర్మాణ సంస్థతోపాటు అభిమానులు కూడా ఎంతగానో హ్యాపీగా వున్నారు.అయితే బ్రో సినిమాకు ఎలాంటి ప్రీమియర్‏ షోలు మరియు బెనిపిట్ షోలు ఉండవని అలాగే టికెట్స్ రేట్లు పెంపు కూడా ఉండదని గతంలోనే నిర్మాతలు తెలియజేశారు. దీంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. మరీ ఈ సినిమా విడుదలయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments