Bro Movie Censor Talk: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం జూలై 28 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో సినిమా టీం అంతా బిజీగా ఉంది. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తి అయ్యాయి. సినిమా మొత్తం వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా విషయంలో లేటెస్ట్ గా దర్శకుడు సముద్రఖని ఓ పోస్ట్ పెట్టడం ద్వారా వెల్లడించారు.
Shah Rukh Khan: జవాన్ కోసం షారుఖ్ కొత్త అవతారం.. ఈసారి అంతకు మించి అనేలా!
సెన్సార్ యూనిట్ కి బ్రో సినిమా చూపించాం మా బ్రో టైం బాగుంది అన్నట్టుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ఇన్సైడ్ రిపోర్టుల ప్రకారం బ్రో సినిమాకి సెన్సార్ టాక్ అదిరిపోయింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అయితే సినిమాలో నెక్స్ట్ లెవెల్ ట్రీట్ లా ఉంటుందని పవన్ ఎంట్రీ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతుంది అని అంటున్నారు. అంతేకాక సాయి ధరం తేజ్ తో కొన్ని సీన్లు అయితే వేరే లెవల్లో ఉంటాయని అంటున్నారు. ఆ లెక్కన సెన్సార్ సభ్యులు టీం ను అభినందించారు అని సినిమా క్లైమాక్స్ లో ఇచ్చే ఎమోషనల్ మెసేజ్ చాలా మందికి కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ అంచనాలతో నిర్మించింది.
