Shah Rukh Khan: జవాన్ కోసం షారుఖ్ కొత్త అవతారం.. ఈసారి అంతకు మించి అనేలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan Dance: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అంచనాలు పెంచేసిన క్రమంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ట్రైలర్‌లో షారుక్ ఖాన్ జుట్టు లేకుండా కనిపిస్తున్న లుక్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో షారూఖ్ మెట్రోలో బెకరార్ కర్కే అనే పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించదు. ట్రైలర్‌లో షారుక్ డ్యాన్స్ క్లిప్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా షారుక్ చేసిన ఈ డ్యాన్స్‌కి ఎవరు కొరియోగ్రఫీ చేశారనేది ఇప్పుడు వెల్లడైంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సీన్ మెట్రోను హైజాక్ చేసేలా ఉందనిపిస్తోంది. దీంతో కొందరు ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్న క్రమంలో షారుక్ ఖాన్ హఠాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇక ఆయన డాన్స్ చేసిన ఈ పాట 1962 బిస్ సాల్ బాద్ చిత్రంలోనిదని అంటున్నారు.
Thirupathi Train: పట్టాలు తప్పిన తిరుపతి-తిరువనంతపురం రైలు.. తప్పిన ప్రమాదం
Also Read
ఇక తాజాగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఈ డ్యాన్స్ స్టెప్పులను షారుక్ ఖాన్ స్వయంగా కొరియోగ్రఫీ చేశారు. షారుఖ్ ఖాన్ చేసిన ఈ డాన్స్ మూమెంట్స్ నచ్చడంతో అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసి పారేస్తున్నారు. షారుక్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో ఈ పాట ఆలోచన దర్శకుడు అట్లీదేనని చెప్పారు. ఇక జవాన్ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్, ప్రియమణి, సన్యా మల్హోత్రా షారుక్ ఖాన్‌తో పాటు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ మరియు ఔరంగాబాద్‌లలో జరిగింది. ఈ సినిమాలో షారుక్ 6 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడని అంటున్నారు. జవాన్‌ను ముందుగా జూన్‌లో విడుదల చేయాలని అనుకున్నా మేకర్స్ విడుదలను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!