Site icon NTV Telugu

Bro First Single: ఆగలేకపోతున్నాం సర్.. ఆశతో.. ఆతృతతో..

Pawan

Pawan

Bro First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ మాటలు అందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గత రెండు రోజులనుంచి ఈ సినిమా మొదటి సింగిల్ రిలీజ్ కానుందని మేకర్ చెప్పుకుంటూ వచ్చారు కానీ, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఇక తాజాగా మొదటి సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించడమే కాకుండా మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ను వదిలారు. మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈ సాంగ్ ను జూలై 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో మామ అల్లుళ్లు లుక్ మాత్రం అదిరిపోయింది. ఇద్దరు బ్లాక్ కలర్ డ్రెస్ లో అల్ట్రా స్టైలిష్ గా కనిపించారు.

Baby Trailer: అబ్బాయిలను గుండెల మీద కొట్టాలంటే.. అమ్మాయిల కంటే గట్టిగా ఎవ్వడు కొట్టలేడు

ముఖ్యంగా పవన్ స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జనసేన ప్రచారంలో వైట్ డ్రెస్ లో చూసి చూసి బోర్ కొట్టేసిన ఫ్యాన్స్ కు ఇలా స్టైలిష్ లుక్ లో పవన్ కనిపించేసరికి మెస్మరైజ్ అవుతున్నారు. ఈ సాంగ్ లో అల్లుడిని.. మామ ఆటపట్టించనున్నాడు. ఇక ఈ సినిమాలో దేవుడిగా పవన్.. మార్కండేయ గా తేజ్ కనిపించనున్నారు. దీంతో ఈ సాంగ్ లో మామ అల్లుళ్లు ఎలాంటి స్టప్స్ తో అదరగొట్టనున్నారో అని అభిమానులు ఆశతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండనుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Exit mobile version