Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?
- ‘కార్మేని సెల్వం’ సినిమా ప్రమోషన్స్
- ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సముద్రఖని కీలక వ్యాఖ్యలు
- పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samuthirakani Reveals Pawan Kalyan’s Bro 2 Script Ready: ‘కార్మేని సెల్వం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు, నటుడు సముద్రఖని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా సీక్వెల్‌పై స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చారు. బ్రో 2 సినిమా గురించి ఇప్పటికే ఆలోచనలు ఉన్నాయని, అయితే ప్రాజెక్ట్ ప్రారంభం పూర్తిగా పవన్ నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పారు. పవన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడే బ్రో 2ను సెట్స్‌పైకి తీసుకెళ్తానని సముద్రఖని స్పష్టం చేశారు.
2023లో విడుదలైన బ్రో సినిమా పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. కథ, సందేశం, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బ్రో సినిమాకు సీక్వెల్ ఉండబోతోంది అంటూ పలు సందర్భాలలో సముద్రఖని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కార్మేని సెల్వం మూవీ ప్రమోషన్లో మీడియా నుంచి బ్రో సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సముద్రఖని మాట్లాడుతూ.. బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉందని తెలియజేశారు. పవన్ అన్నయ్య నుంచి అనుమతి రావడమే ఆలస్యం అంటూ చెప్పారు.
Also Read
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
Also Read: RCB Name Change: ఆర్సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?
ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయ, సినిమా కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. దాంతో ‘బ్రో 2’కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో తెలియదు. ఏదేమైనా సముద్రఖని చేసిన తాజా వ్యాఖ్యలతో బ్రో 2 ప్రాజెక్ట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. మొత్తానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బ్రో 2 త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విషయం తెలిసిన పవన్ ఫాన్స్ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!