చిత్ర పరిశ్రమకు కరోనా దెబ్బ్బ మరోసారి గట్టిగా తగలనుందా ..? అంటే నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. గతేడాది కరోనా వలన చిత్ర పరిశ్రమ కుదేలు అయిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూయడం, షూటింగ్లు ఆగిపోవడం, ప్రముఖులు కరోనా బారిన పడడం ఇలా ఒకటేమిటి సినీ ఇండస్ట్రీకి చెప్పుకోలేనంత నష్టం వాటిల్లింది. ఇక ఈ ఏడాది అయినా కరోనా పోయి థియేటర్లు అవ్వడంతో చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కరోనా థర్డ్ వేవ్ మరోసారి కట్టలు తెంచుకొంది. దీంతో మరోసారి థియేటర్లను మూసి వేసే పరిస్థితి. దీంతో కొన్ని సినిమాల రిలీజ్ అగమ్యగోచరంగా మారింది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికి నాలుగు సార్లు వాయిదా పడింది. కొన్ని అనుకోని కారణాల వలన రెండు సార్లు వాయిదా పడితే కరోనా కారణంగా మరో రెండు సార్లు వాయిదా పడింది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితిలోను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసి జనవరి 7 న రిలీజ్ డేట్ ని ప్రకటించి, ప్రమోషనలను సైతం కానిచ్చేసి ఇక బుకింగ్స్ ని ఓపెన్ చేసే సమయంలో ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ కి కరోనా దెబ్బ తగిలింది. దీంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ” కొన్ని పరిస్థితులు మన చేతులలో ఉండవు.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. మాకు వేరే ఛాయిస్ లేక మేము ఈ పనిని చేస్తున్నాము. కానీ, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాము.. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అలాగే ఉంచమని కోరుతున్నాము. మీకు ప్రామిస్ చేస్తున్నాము.. మంచి సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.
