విలువైన ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయడం సాధారణం.. ఎప్పుడు, ఎలా పోతామో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న విలువైనవాటికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశం ఎలాగూ బీమా కంపెనీలు కలుగజేస్తున్నాయి.దీంతో తమ బాడీలో ఉన్న విలువైన పార్ట్ లకు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం. తాజాగా బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారా తన శరీరంలోని ఒక పార్ట్ ని ఏకంగా రూ. 13 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించుకొంది.
అంత విలువైన పార్ట్ ఏది అంటే.. ఆమె పిరుదులు. నాథీ కిహారాకు తన పిరుదులే అందం. వాటి వల్లనే తను మిస్ బుమ్‌బుమ్ 2021 వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో తనకు ఎంతో పేరుతెచ్చిన పిరుదులను కాపాడుకోవడానికి £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) భీమా చేయించుకున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే ఈ ఇన్సూరెన్స్ కూడా నార్మల్ గా ఏమి రాదు. ఆమె పిరుదులకు నిజంగా డ్యామేజ్ అయితే తప్ప.. తమంతట తాము డ్యామేజ్ చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు. మరి ఎంతో కష్టపడి పెంచి, జాగ్రత్తగా చూసుకుంటున్న వాటిపై ఆ మాత్రం భీమా పెట్టుకోవడంలో తప్పులేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
