Brahmanandam: ఆ పేరు వినగానే పెదవి మీద చిరునవ్వొస్తోంది.. ఆ ముఖం చూడగానే ఎంత బాధలో ఉన్నవారికైనా నవ్వేయాలనిపిస్తోంది. అసలు పరిచయం అక్కర్లేని పేరు.. యావత్ భారతదేశం వినే పేరు బ్రహ్మానందం. కామెడీకి కింగ్.. నటనకు రారాజు. బ్రహ్మి అంటే ఒక్క కామెడీనే కాదు.. ఎలాంటి రసాన్ని అయినా పిండేయగలడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఎన్నోసార్లు కంటనీరు కూడా తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇక నిన్ననే బ్రహ్మానందం 67 వ పుట్టినరోజును జరుపుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే. 67 ఏళ్ళ వయస్సులో కూడా బ్రహ్మి నటిస్తున్నాడు. అయితే ఆ సినిమాలు కూడా చాలా విభిన్నమైనవి కావడం విశేషం. ఈ మధ్యనే పంచతంత్ర కథలు అనే సినిమాలో కనిపించి మెప్పించిన ఆయన ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నాడు. ఇక నిన్న బ్రహ్మి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని బ్రహ్మి డైలాగ్ ను ఒక స్పెషల్ టీజర్ గా రిలీజ్ చేసి ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్.
Posani Krishna Murali: ఏపీఎఫ్ డిసి చైర్మైన్ గా బాధ్యతలు స్వీకరించిన పోసాని
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బ్రహ్మి సింగిల్ షాట్ లెంతీ డైలాగ్ తో ఉన్న ఈ టీజర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో 17 వ రోజున కర్ణుడు ఆఖరి ఘడియల్లో ఉన్నప్పుడు అతనిని పకరించడానికి వచ్చిన ప్రాణ స్నేహితుడు దుర్యోధనుడుకు చెప్పిన మాటలను.. హాస్పిటల్ బెడ్ పై పడుకొని అంతే ఎమోషనల్ గా బ్రహ్మానందం చెప్పడం గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. జనరంజకంగా ఎన్నో ఏళ్ళు సురభి వారు వేసిన నాటకంలో భాగంగా వచ్చిన మాటలని తెలుస్తోంది. కామెడీతోనే కాదు ఇలాంటి పాత్రలతో కూడా బ్రహ్మి ప్రజలను కట్టిపడేశాడు. ఇక ఈ వీడియో చూసాక అభిమానులు అందుకేనయ్యా నిన్ను జనం గుర్తుపెట్టుకొనేది.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
