Site icon NTV Telugu

Brahmanandam : ‘సైంటిస్ట్ వాలీ’గా బ్రహ్మానందం

Brahma

Brahma

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కొంత గ్యాప్ తర్వాత తమిళ సినిమాల్లోకి ఎంట్రి ఇస్తున్నాడు. ఇంతకు ముందు చివరగా సంతానం నటించిన ‘దగల్టీ’లో నటించారు బ్రహ్మీ. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజులకే లాక్‌డౌన్ ప్రకటించడంతో గుర్తింపుకు నోచుకోలేదు. ఇప్పుడు మరోసారి సంతానం సినిమాతో బ్రహ్మానందం తమిళంలో ఎంట్రీ ఇస్తున్నాడు. సంతానం నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిక్’ అనే టైటిల్ పెట్టారు. దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. త్వరలో విడుదల కానున్న ‘కిక్‌’లో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో బ్రహ్మానందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఇందులో ఆయన సైంటిస్ట్ వాలి గా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకుంటున్నారు బ్రహ్మీ. ఇందులో తాన్యా హోప్‌ కథానాయిక. తంబిరామయ్య, సెంథిల్, రాగిణి ద్వివేది, కోవై సరళ, మన్సూర్ ఆలీఖాన్, మనోబాల, వైజి మహేంద్రన్, మొట్టై రాజేంద్రన్ ఇతర ముఖ్య పాత్రధారు. ఈ మూవీకి ప్రశాంత్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా అర్జున్ జన్య నిర్మిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న సంతానం ఈ ‘కిక్’ మూవీతో కమ్‌బ్యాక్ అవుతాడని కోలీవుడ్ వర్గాలతోపాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version