విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ‘పంచంతంత్రం’ కోసం కొత్త అవతారాం ఎత్తాడు. అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. కథకుడిగా నటిస్తున్న బ్రహ్మానందం ఫస్టలుక్‌ను శనివారం విడుదలచేశారు.
ఇందులో వేదవ్యాస్ పాత్రలో కనిపించబోతున్నారు బ్రహ్మీ. నవ్వించడమే కాదు సెంటిమెంట్‌ను పండిస్తూ ప్రేక్షకులతో
కన్నీళ్లు పెట్టించి మనసుల్ని కదిలించేలా బ్రహ్మానందం పాత్ర ఉంటుందట. రెండేళ్ల తర్వాత బ్రహ్మానందం నటిస్తున్న చిత్రమిది. గతంలో బ్రహ్మానందంపై కొన్ని సీన్స్ తీశామని, ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్లో మిగిలిన సన్నివేశాలను పూర్తిచేశామని, ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తయిందంటున్నారు నిర్మాతల్లో ఒకరైన అఖిలేష్ వర్థన్. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, నవంబర్‌లో విడుదల చేస్తామని, వేదవ్యాస్‌గా ఆయన పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందంటున్నారాయన. పంచతంత్రం కథ, పాత్రలను వివరించే కథకుడిగా బ్రహ్మానందం కనిపిస్తారని, నటుడిగా ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇదని దర్శకుడు హర్ష చెబుతున్నారు.