NTV Telugu Site icon

హాస్యబ్రహ్మ “అన్‌స్టాపబుల్”… బాలయ్య షోలో బ్రహ్మీ సందడి

Unstoppable With NBK

Unstoppable With NBK

నందమూరి బాలకృష్ణ హోస్టుగా “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫుల్ స్టాప్ లేకుండా దూసుకెళ్తోంది. షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో ఈ షోకు వ్యూస్ వస్తుండడం విశేషం. మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం… మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ షో 3 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా బాలయ్య షోలో బ్రహ్మీ సందడి చేయబోతున్నాడు. తాజా ఎపిసోడ్ లో హాస్యబ్రహ్మ “అన్‌స్టాపబుల్” ఫన్ తో తెలుగు ‘ఆహా’ అభిమానులను అలరించనున్నారు. ‘ఫన్’టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో మెరవబోతున్నారన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read Also : ఓటీటీలో బాలయ్య సరికొత్త రికార్డు

నందమూరి బాలకృష్ణ భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్ని రోజులు ఆగిపోయిన “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” మళ్ళీ మొదలైంది. బాలయ్యతో అనిల్ రావిపూడి, బ్రహ్మానందం చేయబోయే ఫన్ చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 3న ‘ఆహా’లో ప్రసారం అవుతుంది.

మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తుంది. ఈ చిత్రంలో ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను గోపీచంద్ మలినేనితో కలిసి మొదలు పెట్టేశారు. ‘NBK107’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే తాత్కాలిక టైటిల్ తో పిలుస్తున్నారు.