NTV Telugu Site icon

Brahmaji: కుక్కపిల్లలా ఉండాలి మా ఆవిడ దగ్గర.. గొడవైతే ఏం చేస్తానంటే..?

Brahmaji

Brahmaji

Brahmaji: టాలీవుడ్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని తెరమీదనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చూపిస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ మధ్యనే విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బ్రహ్మాజీ.. మొట్ట మొదటిసారి తన భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూకు వచ్చాడు. వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న ఒక చాట్ షో లో తన భార్య శాశ్వతితో కలిసి సందడి చేశాడు. బ్రహ్మాజీ లవ్ స్టోరీ సినిమాకే మాత్రం తీసిపోదు. సింధూరం సినిమా తరువాత బ్రహ్మాజీ ఒక ఈవెంట్ లో బెంగాలీ మహిళ శాశ్వతిని కలిశాడు. అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా ప్రేమకు ఇలాంటివేమీ అడ్డురావని శాశ్వతిని వివాహమాడి.. ఆమె కొడుకునే తన కొడుకుగా మార్చుకున్నాడు. ఇక మొట్టమొదటిసారి తమ లవ్ స్టోరీని ఈ షోలో బయటపెట్టాడు బ్రహ్మాజీ.

Naresh Agastya: ‘#మెన్ టూ’ రిలీజ్ డేట్ మారింది!

” ఒక పక్క మూన్ లైట్.. ఇంకోపక్క సన్ లైట్.. ఆ ప్రదేశంలో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెకు ప్రపోజ్ చేశాను. మా పెళ్లికి డైరెక్టర్ కృష్ణవంశీ కన్యాదానం చేశాడు. నా చైన్ తాకట్టు పెట్టి ఆమెకు ఒక గిఫ్ట్ కొన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక శాశ్వతి మాట్లాడుతూ.. ఒక సమయంలో బ్రహ్మాజీ చేతిని బ్లేడుతో ఎవరో ఒక అమ్మాయి కట్ చేస్తే.. తానే దగ్గరఉండి హాస్పిటల్ తీసుకెళ్లినట్లు సీక్రెట్ రివీల్ చేసింది. ఇక పెళ్లి తరువాత తన భార్య ఏది చెప్తే అది వినడం నేర్చుకున్నాను అని, కుక్కపిల్లకు బిస్కెట్ వేస్తే ఎలాగైతే మొరుగుతూ వెళ్తుందో.. ఆలా తన భార్యను ఫాలో అవుతున్నట్లు తెలిపాడు. ఇక తన భార్యతో గొడవ ఐతే 10 నిముషాలు కూడా ఇంట్లో ఉండనని, వెంటనే కారు తీసుకొని బయటకు వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు. మా సమయంలో ఫోన్లు లేకపోవడంతో తన జీవితం మొత్తం పబ్లిక్ బూత్ ల వద్దే గడిచిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక తన భార్య బూతులు తిడితే మూడు రోజులు అన్నం తినలేరని చెప్పిన బ్రహ్మాజీ తన భార్య అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments