NTV Telugu Site icon

Pushpa 2: రిలీజ్ కి ముందు కొత్త టెన్షన్.. బాయ్ కాట్ కి పిలుపు!

Pushpa2 (2)

Pushpa2 (2)

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధమవగా సెన్సార్ కూడా పూర్తవుతుంది. తాజాగా నిన్న తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. ఇక నిన్న రాత్రి సమయంలో నైజాం ప్రాంతాల్లో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇక ఇప్పుడు ఇదే సరికొత్త టెన్షన్ ను తెరమీదకు తీసుకొచ్చింది. అదేంటంటే ఈ సినిమాని ఇంత పెట్టి చూడడం కరెక్ట్ కాదని అంటూ చాలామంది ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ కామెంట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Pushpa 2: ఆర్ఆర్ఆర్ రికార్డుపై కన్నేసిన పుష్ప 2

ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 నుంచే బెనిఫిట్ షోస్ వేయాలని ఆరోజు అర్ధరాత్రి సమయంలో స్పెషల్ షోస్ వేయాలని టీం నిర్ణయం తీసుకుంది.