NTV Telugu Site icon

Boyapati Srinu: కుదరలేదంతే… మరి కుదిరితే ఊచకోతేనా?

Boyapati

Boyapati

మహేష్ బాబు లాంటి కటౌట్‌కి హాలీవుడ్ రేంజ్ సినిమా పడితే ఎలా ఉంటుందో… నెక్స్ట్ రాజమౌళి సినిమాతో చూడబోతున్నాం. ఇప్పటి వరకు రీజనల్ బౌండరీస్ దగ్గరే ఆగిపోయిన సూపర్ స్టార్… జక్కన్న ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా కాదు, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు, ఆస్కార్‌ను కూడా టార్గెట్‌ చేస్తాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్‌ నెక్స్ట్ లైనప్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు కానీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం ఎప్పటికైనా మహేష్‌తో సినిమా చేస్తానని చెబుతున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో… మహేష్ బాబుతో ఓ కమర్షియల్ సినిమా చేయాలని, మహేష్ ఏదైనా చెయ్యగలడని… మాస్, క్లాస్, ఫ్యామిలీ… అది ఇది అని లేదు మహేష్ ఒక ఆల్ రౌండర్ అని చెప్పుకొచ్చాడు బోయపాటి. అలాగే… గతంలోనే మహేష్‌కి ఓ కథ చెప్పాను.. ఓకె అనుకున్నాం.. కానీ మహేష్ చేస్తున్న చిత్రం పూర్తి అయ్యేలోపు.. నేను వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అలా ఇద్దరికీ కుదరలేదు కానీ మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు.

ఒకవేళ ఈ క్రేజీ కాంబో నిజంగనే సెట్ అయితే… బోయపాటి, మహేష్‌ను ఎలా ప్రజెంట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. బోయపాటి, బాలయ్యను తప్ప మిగతా స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడు. ఎన్టీఆర్ ‘దమ్ము’, రామ్ చరణ్‌ ‘వినయ విధేయ రామ’తో రొడ్డ కొట్టుడు కొట్టాడు. లేటెస్ట్ ఫిల్మ్ ‘స్కంద’తోనూ తెగ నరికాడు. అయినా సరే… ఈ మాస్ డైరెక్టర్‌తో మహేష్‌ సినిమా అంటే ఊచకోతే. శ్రీమంతుడు తర్వాత అన్నీ సోషల్ కాజ్ సినిమాలు చేస్తు వచ్చాడు మహేష్‌. గుంటూరు కారంలో అది లేదని అంటున్నా… ఇలాంటి సమయంలో మహేష్‌ నుంచి ఒక కమర్షియల్ మాస్ సినిమా పడితే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి… బోయపాటి, మహేష్‌ ప్రాజెక్ట్ సెట్ అయితే మాస్‌ కా బాప్‌లా ఉంటుంది. మహేష్ కటౌట్‌కి తగ్గట్టుగా సాలిడ్ మాస్ కంటెంట్ పడితే… బాక్సాఫీస్ దగ్గర ఊచకోత మామూలుగా ఉండదు. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Show comments