Site icon NTV Telugu

Boyapati Srinu : రతనాల సీమపై మాస్ డైరెక్టర్ ఆవేశపూరిత స్పీచ్

Boyapati

Boyapati Srinu దర్శకత్వంలో రూపొందిన “అఖండ” చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటన, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ చిత్రం 2021 డిసెంబర్ 2న విడుదలైంది. ‘అఖండ’ తరువాత ఇప్పటి వరకు చాలా పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ… ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ ను “అఖండ”లా షేక్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తవ్వడంతో ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. అందులో యంగ్ డైరెక్టర్ బోయపాటి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రతనాల సీమపై మాస్ డైరెక్టర్ చేసిన ఆవేశపూరిత స్పీచ్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Also : KV Mahadevan Birth Anniversary : మధురాతి మధురం… ‘మామ’ స్వరఝరి!

“రాయలసీమ వాళ్ళకి సినిమా నచ్చితే ప్రపంచానికి నచ్చుతుంది” అంటూ బోయపాటి చేసిన కామెంట్స్ అక్కడి వారిని బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు చరిత్ర రాయాలన్నా, దానిని తిరగరాయాలన్నా అభిమానులే అంటూ వారిని ఆకాశానికెత్తేశారు. “అఖండ” హిట్ ఇచ్చిన జోష్ బోయపాటితో స్పష్టంగా కన్పిస్తోంది. ఆయన ఇదివరకెన్నడూ ఇంత ఆవేశపూరితంగా స్పీచ్ ను ఇచ్చింది లేదనే చెప్పాలి. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి !

Exit mobile version