Site icon NTV Telugu

Boyapati Srinu: ఓటు కోసం కాదు భవిష్యత్ కోసం పనిచేసే నాయకుడికి ఓటు వేయండి

Boyapati

Boyapati

Boyapati Srinu intresting comments on Voting: గుంటూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మక ఆర్ వీ ఆర్ & జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్,కల్చరల్ స్పోర్ట్స్ టెస్ట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను కూడా జేకేసీ కాలేజీలోనే చదివానని పేర్కొన్న ఆయన ఆ తరువాత
పది సినిమాలు తీశానని అన్నారు. ఇక జీవితంలో ప్రతి విద్యార్థికి బ్యాలెన్సింగ్ ఉండాలని, అరచేతిలో ప్రపంచాన్ని చూపించేది ఇంజనీర్లే అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లండి, ఎదగండి కానీ తల్లిదండ్రులను వదలకండని ఆయన కోరారు.చదువుతున్న ప్రతి విద్యార్థి పోలింగ్ బూత్ కు వెళ్ళి ఓటు వేయండని కోరిన బోయపాటి శ్రీను ఓటు కోసం చూసే నాయకుడికి కాదు భవిష్యత్ కోసం పనిచేసే నాయకుడికి ఓటు వేయండని అన్నారు.`

Ooru Peru Bhairavakona: “ఊరు పేరు భైరవకోన”పై కోర్టు కేసు.. రిలీజ్ కి తొలగిన అడ్డంకులు

అప్పుడే మన భవిష్యత్ కు బాటలు వేసే మంచి నాయకుడు వస్తాడని ఆయన పేర్కొన్నారు. ఇక నేను తీసే ప్రతి సినిమా లో ఒక సందేశం ఉండేలా చూస్తానని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. చివరిగా రామ్ తో స్కంద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు అనేది క్లారిటీ లేదు. ఆయన అల్లు అరవింద్ తో కలిసి సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది కానీ హీరోగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఆయన అల్లు అర్జున్, బాలకృష్ణ లేదా సూర్యలతో సినిమా చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజానికి బాలకృష్ణతో ఆయన అఖండ 2 సినిమా చేయాలి ఆ సినిమా ఈ సినిమానే అవుతుందా లేక వేరే సినిమా అవుతుందా అనేది చూడాలి.

Exit mobile version