Site icon NTV Telugu

Boyapati Rapo: ‘రామ్-బోయపాటి’ పవర్ ఫుల్ టైటిల్…

Boyapati Rapo

Boyapati Rapo

ఇస్మార్ట్ శంకర్‌తో మాసివ్ హిట్ అందుకున్న రామ్ పోతినేని.. అదే జోష్‌లో రెండు సినిమాలు చేశాడు. అందులో రెడ్ మూవీ ఓటిటికే పరిమితం అవగా.. ది వారియర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఇస్మార్ట్ హీరోకి అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. అది కూడా ఊరమాస్ సబ్జెక్ట్‌ అయి ఉండాలి. అలాంటి హిట్ కావాలంటే.. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ఉండాల్సిందే. అందుకే బోయపాటితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్. దసరా టార్గెట్‌గా ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు కానీ ఆ సమయంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ అవుతుండడంతో సెప్టెంబర్ 15న రిలీజ్ చెయ్యనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్.. అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పూర్తిగా బోయపాటి హీరోలా మారిపోయి.. గడ్డం పెంచి ఊరమాస్ లుక్‌లో కనిపించాడు రామ్.

Read Also: Kerala Story: కేరళ స్టోరీ టీమ్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా ‘బస్తర్’

ఈ లుక్ చూసి రామ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా బోయపాటి రాపో వర్కింగ్ టైటిల్‌తోనే సెట్స్ పైకి వెళ్లింది. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాకు ‘స్కంద’ అనే అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ.. భుజ బలాన్ని తెలియజేసేలా.. కథ ప్రకారం ఈ టైటిల్‌‌ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని భావిస్తున్నారట మేకర్స్. జూన్ 28న ఈ టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version