Site icon NTV Telugu

Box Office War: రేసులోకి కంగువ? మరి దేవర vs గేమ్ చేంజర్?

Box Office War

Box Office War

ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే… షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర, గేమ్ చేంజర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. దేవర సినిమా వాయిదా పడుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా బయటికి రాలేదు గానీ… కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. అయితే దేవరకు దసరా తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. అలాగే… రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’కు కూడా దసరాకే వచ్చే అవకాశముంది.

ప్రస్తుతానికైతే దసరా స్లాట్ ఖాళీగానే ఉంది. దీంతో ఎవరు ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా? అని వెయిట్ చేస్తున్నారు కానీ సూర్య మాత్రం దసరా రేసులోకి రావడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సూర్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో… ఏకంగా పది భాషల్లో పాన్ ఇండియా లెవల్లో… శివ తెరకెక్కిస్తున్న కంగువ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న కంగువ… పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఈ సినిమాను దసరా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 10న కంగువ థియేటర్లోకి రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే అధికారిక క్లారిటీ రానుందని అంటున్నారు. ఒకవేళ సూర్య కూడా దసరా రేసులో కన్ఫామ్ అయితే… దేవర, గేమ్ చేంజర్‌లో ఏదో ఒక సినిమాతో గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. మరి దసరా సినిమాల పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Exit mobile version