Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం తమ నెక్ట్స్ సినిమాలతో ఒకే రోజు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘EPIC – ఫస్ట్ సెమిస్టర్‘ మరియు కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ‘ చిత్రాలు జులై 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మంచి హైప్ ఉండటంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది.
‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం ‘EPIC’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా తన ‘చెన్నై లవ్ స్టోరీ’తో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ‘బేబీ’ మేకర్స్ ఎస్.కె.ఎన్ మరియు సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. “మొదటి ప్రేమ కంటే ఓటమి తర్వాత వచ్చే ప్రేమే గొప్పది” అనే వైవిధ్యమైన పాయింట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఈ రెండు సినిమాలు కూడా స్వచ్ఛమైన ప్రేమకథలతోనే వస్తుండటం విశేషం. జులై 10న ఈ ఇద్దరు యంగ్ హీరోలలో బాక్సాఫీస్ వద్ద ఎవరి హవా సాగుతుందో చూడాలి.
Also Read
- Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్‌పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
తాజావార్తలు
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్‌లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!