Box Office Clash : ఒకే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’

Tollywood

Tollywood

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం తమ నెక్ట్స్ సినిమాలతో ఒకే రోజు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న EPIC – ఫస్ట్ సెమిస్టర్ మరియు కిరణ్ అబ్బవరం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు జులై 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మంచి హైప్ ఉండటంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది.

‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం ‘EPIC’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా తన ‘చెన్నై లవ్ స్టోరీ’తో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ‘బేబీ’ మేకర్స్ ఎస్.కె.ఎన్ మరియు సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. “మొదటి ప్రేమ కంటే ఓటమి తర్వాత వచ్చే ప్రేమే గొప్పది” అనే వైవిధ్యమైన పాయింట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఈ రెండు సినిమాలు కూడా స్వచ్ఛమైన ప్రేమకథలతోనే వస్తుండటం విశేషం. జులై 10న ఈ ఇద్దరు యంగ్ హీరోలలో బాక్సాఫీస్ వద్ద ఎవరి హవా సాగుతుందో చూడాలి.